Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో ఎస్సీ అభివద్ధిశాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 13 ఎస్సీ వసతి గహాల్లో అన్ని వసతులతో కూడిన పనులు ఫిబ్రవరి 10 కల్లా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి వసతి గహాలకు అన్ని వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. కానీ, విద్యార్థుల శాతం ఆశాజనకంగా లేదని అన్నారు. జిల్లాలో అంబేద్కర్ భవనాల నిర్మాణాల పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తైన కమ్యూనిటీ హాల్స్‌ను సదరు గ్రామ పంచాయతీలకు అందజేయాలని అన్నారు. నీతి అయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలోని 117 అంగన్‌వాడీసెంటర్లను, ములుగు జిల్లా లో 117 అంగన్వాడీ కేంద్రాలను మోడల్ అంగన్వాడీ సెంటర్లుగా సుందరీ కరణ చేయనున్నామన్నారు. సకాలంలో పనులు పూర్తి చేసి జిల్లాను ఆదర్శ జిల్లాగా మార్చాలని కోరారు. డీఎస్డీఓ సునిత, పాల్గొన్నారు.
చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు, వికలాంగుల పింఛన్లు, ఇతర సమస్యల పరిష్కారానికి పలువురు దరఖా స్తులు చేసుకున్నారన్నారు. ప్రజలు తప్పక మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.