Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పలిమెల
గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు చేసి 20 డ్రమ్ముల బెల్లం పానకం పారబోసి 5బస్తాల బెల్లం, పటికను స్వాధీనం చేసుకున్న ఘటన మండల పరిధి సర్వాయి పేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఎస్ఐ అరుణ్ కుమార్ మాట్లాడుతూ... గ్రామాలలో యువత చెడు మార్గం వైపు మళ్లొద్దన్నారు. గుడుంబా, మత్తుపదార్థాలకు బానిసలు కాకూడదని సూచించారు. దాడిలో పలువురిపై కేసు కేసులు నమోదు చేశామన్నారు. కారోనా పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.