Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖానాపురం : ఖానాపురం మండలం చిలకమ్మతండ గ్రామ అభివృద్ధికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎంపీటీసీ భట్టు శంకర్ అన్నారు. మండలంలోని చిలకమ్మ తండా గ్రామపంచాయతీ పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీటీసీ భట్టు శంకర్ సోమవారం ప్రారం భించి మాట్లాడారు. ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ నిధులు రూ 1.20 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. సర్పంచ్ బానోతు వెంకన్న, ఉపసర్పంచ్ బానోత్ ఈర్య, పంచాయతీ కార్యదర్శి పోషాల యుగంధర్, వార్డు మెంబర్లు లకావత్ శ్రీను, కో-ఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.