Authorization
Fri March 14, 2025 09:46:50 pm
జనగామ రూరల్ : రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను దశలవారీగా ప్రారంభిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై మండలం లోని యశ్వంతపూర్ గ్రామంలో నిర్మించిన టీఆర్ఎస్ జనగామ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సోమవారం ఎమ్మెల్యే తాగికొండ రాజయ్యతో కలిసి మంత్రి పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కాళోజీ, జోతిరావు ఫులే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్యాలయం ప్రారంభం అయితే కార్యకర్తలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జనగామ జిల్లా పార్టీ కార్యాలయం ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండేదని, ముఖ్యమంత్రి రావడం ఆలస్యం కావడంతో ప్రారంభించ లేకపోయామని చెప్పారు.