Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
నియోజకవర్గంలో రూ.24.25కోట్లతో బీటీ రోడ్లు మంజూరైనట్టు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల యంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాటాడారు. ప్రతి గ్రామానికి, తండాకు పక్కా రోడ్ల సౌకర్యం కల్పించాలని సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దృష్టికి తీసుకెళ్లగా స్పందించి నిధులు కేటాయించారని అన్నారు. రూ.15.25కోట్లతో నూతన బీటీ రోడ్లు మంజూరు చేయగా రూ.9కోట్లతో బీటీ రీన్యూవల్ నిధులు కేటాయించామన్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. మరో 10 రోజుల్లో మిగతా గ్రామాలకు కూడా రోడ్లు మంజూరు కానున్నట్టు చెప్పారు. మండలంలోని చంద్రయ్యపల్లి-తిమ్మంపేట గ్రామం వరకు రోడ్డుకు రూ.60లక్షలు, జెడ్పీ రోడ్డు నుంచి రాజేశ్వరావుపల్లి గ్రామం వరకు రూ.80లక్షలు, కమ్మపెల్లి గ్రామం నుంచి తిమ్మంపేట వరకు రూ.90లక్షలు కేటాయించినట్టు తెలిపారు. దుగ్గొండి మండల పరిధి జాఫర్‌పల్లి నుంచి మైసంపల్లి ఎస్సీ కాలనీ ఆర్అండ్బీ రోడ్డు వయా స్వామిరావుపల్లి వరకు రూ.80లక్షలు, దుగ్గొండి నుంచి సాంబ య్యపల్లి గ్రామం వయా గుడి మహేశ్వరం వరకు రూ.1.80 కోట్లు, ముద్దు నూర గ్రామం నుంచి గుడ్డెల్గులపల్లి గ్రామం క్రాస్ రోడ్డు వరకు రూ.60లక్షలు, నాచినపల్లి గ్రామం నుంచి కొమ్మాల ఆలయం వరకు రూ.1.25 కోట్లు, దుగ్గొండి రోడ్డు నుంచి రేబల్లె గ్రామం వరకు వయా బండారుపల్లి గ్రామానికి రూ.95లక్షలు కేటాయించినట్టు తెలిపారు. చెన్నారావుపేట మండలంలో ఆర్అండ్బీ రోడ్డు నుంచి జోజిపేట నారాయణ తండా వరకు రూ.60లక్షలు, లింగాపురం నుంచి గోపగాని తండా వరకు రూ.80లక్షలు, నల్లబెల్లి మండలం లోని పీఆర్ రోడ్డు నుంచి ఒల్లె నర్సయ్యపల్లి బీటీ రోడ్డు వరకు రూ.90లక్షలు, ఎన్‌హెచ్ 365 నుంచి ధర్మారావుపల్లి గ్రామం వరకు రూ.85 లక్షలు, నెక్కొండ మండలంలోని పీడబ్ల్యూడీ రోడ్డు రెడ్డవాడ గ్రామం నుంచి బొల్లికొండ గ్రామం వరకు రూ.3.50 కోట్లు మంజూరు చేశామన్నారు.