Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
2022-23 విద్యాసంవత్సరానికి ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం బడుగులకు శుభసూచకం అయినప్పటికీ ఉపాధ్యాయులు, పర్యవేక్షణ కొరత తీవ్రంగా ఉందని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షులు పార్నంది రామయ్య అన్నారు. మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించగా ఆయన మాట్లాడారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, మండల, జిల్లా విద్యాధికారుల పోస్టులను భర్తీ చేయకుండా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం ప్రభుత్వ ఉపాధ్యాయులను భగం చేయడానికేనని దుయ్యబట్టారు. బడ్జెట్లో పేద దళిత గిరిజన విద్యార్థులకు నోటు పుస్తకాలు, చెప్పులు, యూనిఫామ్ సంఖ్య పెంచి పెన్నులు, పెన్సిళ్లు, బ్యాగులు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు కోడెం రజిత, జిల్లా కార్యదర్శి వెంకన్న, సుంచ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.