Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
ప్రభుత్వాలు అందించే ఉపాధి మాత్రమే గాక, స్వయం ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. డివిజన్ కేంద్రంలో నిర్వాహకుడు గణేష్ నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ జగదాంబ స్వీట్ హౌస్ (మిఠాయి బండార్)ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ మారపాక రవి, నియోజకవర్గ ఆఫీస్ ఇంచార్జ్ ఆకుల కుమార్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు తాటికొండ సురేష్ కుమార్, మండలాధ్యక్షులు మాచర్ల గణేష్, ఎంపీటీసీ గన్ను నర్సింహులు, ఏఎంసీ వైస్ ఛైర్మన్ చందర్ రెడ్డి, దిశ కమిటీ సభ్యులు మాలోతు రమేష్ నాయక్, మండల యూత్ అధ్యక్షులు గుండె మల్లేష్, సున్నం యాదగిరి ఏసుబాబు, మండల కార్యదర్శి వారణాసి రామక్రిష్ణ, గుర్రపు నరసింహా, గాదెరాజు, గుండె రంజిత్, తదితరులు పాల్గొన్నారు.