Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి
నవతెలంగాణ-ఆత్మకూర్
మినీ మేడారంగా పేరుగాంచిన అగ్రంపహాడ్ సమ్మక్క-సారక్క జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మి తెలిపారు. అగ్రంపహాడ్‌లోని సమ్మక్క-సారక్క గద్దెలను గురువారం ఆమె సందర్శించారు. అనంతరం పార్కింగ్ స్థలాలు, బస్టాండ్, క్యూలైన్ల నిర్మాణాలు, పోలీస్ అధికారులు, సిబ్బంది వసతి ప్రాంగణాలను అడిషనల్ డీసీపీ సాయి చైతన్య, పరకాల ఏసీపీ శివరామయ్య, తహశీల్దార్ సురేష్ కుమార్‌లతో కలిసి పరిశీలించారు. తదనంతరం ఆమె మాట్లాడుతూ.. జాతర సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు అందించారు. పార్కింగ్ స్థలాల్లో ఫోకస్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. జాతర ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జాతర విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు గణేష్ కుమార్, రంజిత్ కుమార్, ఎస్సై ప్రసాద్, ఎఎస్ఐ శంకర్ తదితరులు పాల్గొన్నారు.