Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ఉపాధ్యాయులకు డైరీ దిక్చూచిగా పనిచేస్తుందని డీటీఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు గుంటి రాంచందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కే.యాకయ్య అన్నారు. మండల ఎంఆర్సీలో గురువారం డీటీఎఫ్ క్యాలెండర్, డైరీ 2022 ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం డీటీఎఫ్ రాజీలేని పోరాటాలను సాగిస్తోందన్నారు. విద్యా రంగ వ్యవస్థలో ఉపాధ్యాయుల పక్షాన భవిష్యత్ పోరాటాలకు సన్నద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దార్ల రవీందర్, కార్యదర్శి కునమల్ల కొమ్మాలు, మండలాధ్యక్షులు ఎస్కే. సర్ధార్, ప్రధాన కార్యదర్శి పూజారి రవి, కొర్ర రమేష్, నాగేశ్వర్, సంతోష్ కుమార్, వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు.