Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
షెడ్యూల్ కులాల హక్కుల అభివృద్ధి సమితి కార్మిక విభాగం క్యాలెండర్ను కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు యమడాల హనూకాంత్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మానవ హక్కుల కమిషన్ కౌన్సిల్ చైర్మన్ రాజారపు ప్రతాప్, కరీంనగర్ డిప్యూటీ లేబర్ కమిషనర్ రమేష్ బాబు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ నవీన్ కుమార్లు ముఖ్యఅతిథులుగా హాజరై ఈ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దాస్యం మంజుల, రాజమౌళి, స్వరూప, డానియల్, మదీనా పాల్గొన్నారు.