Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మున్సిపల్ చైర్పర్సన్ అంగోతు అరుణ
నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్ధన్నపేట మున్పిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, అందుకోసం రూ.38 కోట్లతో పనులను చేస్తున్నామని చైర్పర్సన్ అంగోతు అరుణ తెలిపారు. పురపాలక సంఘం పాలక వర్గం కాలపరిమితి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా గురువారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన సమావేశములో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సహకారంతో రూ.38కోట్ల అభివద్ధి పనులను చేస్తున్నామని, త్వరలో వాటిని పూర్తి చేస్తామన్నారు. మొదటి విడతలో మంజూరయిన టీయూఎఫ్ఐడీసీ నిధులలో ఇంకా రూ.10 కోట్ల పనులు పూర్తి కాలేదన్నారు. మార్చి 31వరకు చేయని పక్షంలో ఏజెన్సీ మార్చే చర్యలు తీసుకుంటామన్నారు. మరో రూ.10 కోట్లు టీయూఎఫ్ఐడీసీ నిధులు టెండర్ దశలో ఉన్నాయని, ఈ పనులను మార్చి నెలలో ప్రారంభించాలన్నారు. పట్టణ ప్రగతి నుంచి రూ.3కోట్ల నిధులు, శ్రీనిధి నుండి రూ.2 కోట్ల నిధులు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో, సమీకత మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రూ.2 కోట్లు, డీసీ తండాలో శ్మశానవాటిక నిర్మాణం కోసం రూ.కోటి రూపాయలు మంజూరు అయి టెండర్ పూర్తి అయిందన్నారు. పనులను వేగంగా పూర్తి చేస్తామన్నారు. రెండేండ్ల పాటు అందించిన పోత్సాహం, సహాయ సహకారాలను ముందు ముందు కూడా ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోనే నెంబర్వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు పాలక వర్గం కషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పాలక వర్గాన్ని మున్సిపాలిటీ సిబ్బంది ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ గొడిశాల రవీందర్, వైస్ చైర్మన్ కొమాండ్ల ఎలెందర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు సమ్మెట సుధీర్, తోటకురి రాజమణి, కొండేటి అనిత, భూక్య సరిత, బానోతు అనిత, పాలకుర్తి సుజాత, పద్మ, మంచాల రామకష్ణ, తుమ్మల రవీందర్, పూజారి సుజాత పాల్గొన్నారు.