Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
మండలంలోని రాయిగూడెంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటునకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. గురువారం సర్పంచ్ వంకుడోతు రాజమణి మొగిలి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటునకు సహకారం అందించాలని కోరగా.. స్పందించిన ఎమ్మెల్సీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల అదనపు గదుల కొరతను వివరించగా.. సానుకూలంగా స్పందించి పాఠశాలకు అదనంగా రెండు తరగతి గదులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఉప సర్పంచ్ కే మహేష్, రైతు కన్వీనర్ నగేష్ రెడ్డి, ఇంద్రా రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, కల్లూరు వీరయ్య, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు అందరూ ఆయనకు కతజ్ఞతలు తెలియజేశారు.