Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
బాలికల పట్ల వివక్ష విడనాడి, వారు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని బాల కార్మిక సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బుర్ర అశోక్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం 13వ డివిజన్ ఎం.హెచ్ నగర్ లో ఎఫ్ఎంఎం, స్వర్ణభారతి యూత్ వెల్ఫేర్ సొసైటీల ఆధ్వర్యంలో జరిగిన జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తల్లిదండ్రులు ఎలాంటి వివక్ష లేకుండా ఆడ మగ ఇద్దరినీ సమానంగా పెంచినప్పుడే సమాజం అన్ని విధాల ముందుకు సాగుతుందన్నారు. బాలికలపై పెరుగుతున్న విపక్ష తగ్గాలంటే ప్రజల్లో ముఖ్యంగా స్ల్లమ్ ఏరియాలో ఉండే వారిలో చైతన్యం రావాలన్నారు. సరైన అవకాశాలు కల్పిస్తే మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తారని అన్నారు.
అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ప్రసాద్ మాట్లాడుతూ.. పిల్లల చేత పనులు చేయిస్తే చట్టరీత్యా నేరమని అందుకు మొదటి శిక్ష గా 20వేల జరిమానా, రెండవ సారి తప్పు చేస్తే జైలుశిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా ఉంటుందని అన్నారు. స్థానిక కార్పొరేటర్ సురేష్ జోషి మాట్లాడుతూ.. పేద వర్గాల పిల్లల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తన డివిజన్ పరిధిలోని స్లం ఏరియా లో ఏదైనా దుర్ఘటన జరిగితే వెంటనే సంబంధిత అధికారుల దష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ భారతి యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు పాలడుగుల నిర్మల, సామాజికవేత్త డాక్టర్ సురేందర్, సేవా వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అయిత ఉష భాస్కర్, జన్ను సుగుణాకర్ర్, మహిళా సంఘం ఆర్ పి లు లావణ్య, హైమావతి, జ్యోతి, రమా, లక్ష్మి, డాక్టర్ నర్సయ్య, రాజమౌళి పాల్గొన్నారు.