Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధికారులను గ్రామంలోకి రానివ్వం
కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్
నవతెలంగాణ - చెన్నారావుపేట
అప్పులు చెల్లించాలని సహకార సంఘం అధికారులు రైతులను భయభ్రాంతులకు గురి చేస్తోన్నారని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భూక్య గోపాల్‌నాయక్ తెలిపారు. సహకార సంఘం అధికారులను గ్రామంలోకి రానివ్వమని పేర్కొన్నారు. గురువారం అధికారులు అక్కల్చెడ గ్రామానికి ఈ క్రమంలో వస్తుండగా కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు ఎడ్లబండి అడ్డుపెట్టి అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతులకు 50శాతం రుణమాఫీ చేస్తానని ప్రకటించి, ఇప్పుడేమే అప్పుకట్టాలని అధికారులను పంపించడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఓట్ల కోసం రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక మొహం చాటేసి రైతులను మోసం చేసారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం రైతులకి రుణమాఫీ అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆయనను రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారులని అడ్డుకోవాలన్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేసేంతవరకి కాంగ్రెస్ పార్టీ రైతలకు అండగా ఉండి పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొడ సురేష్, మాలోత్ పూల్‌సింగ్, భూక్య రాజు, మాలోత్ చక, రాజు, ఈర్యా పాల్గొన్నారు..