Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి
నవతెలంగాణ-జఫర్గడ్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించి నిర్వహించి పార్టీని బలోపేతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో మండల కమిటీ సభ్యుడు గుండెబోయిన రాజు అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని విమర్శించారు. మోదీ విధానాలతో కార్పొరేట్ సంస్థల ఆదాయం పెరుగుతుంటే.. సామాన్యుల పేదల ఆదాయం తగ్గుతోందని మండిపడ్డారు. హిందూ రాజ్యంగా మార్చే ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల కార్మికుల హక్కులు కాలరాస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఏమీ చేయలేదని ఏమో చేసినట్టు ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, పార్టీ మండల కార్యదర్శి రాపర్తి సోమయ్య, మండల కమిటీ సభ్యులు వడ్లకొండ సుధాకర్, ఎండీ శంశొద్దిన్, అంబటి యాదగిరి, వేల్పుల రవి, వేల్పుల చిన్న రాములు, నక్క యాకయ్య, ఉప్పునూతల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.