Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఏసీపీి రఘుచందర్ సూచించారు. గురువారం నెల్లుట్లలోని హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణ, వేగ నియంత్రణ కోసం శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ (స్వరాజ్ ట్రాక్టర్స్) సహకారంతో లింగాల గణపురం పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాప్ బోర్డుల ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనగామ రూరల్ సీఐ వినరు కుమార్, లింగాల గణపురం ఎస్ఐ సీహెచ్ రఘుపతి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్, గంగధర్, ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.