Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకే ప్రభుత్వం గురుకుల విద్యాలయాల ద్వారా విద్యను ప్రోత్సహిస్తుందని, ప్రతి ఒక్కరు ఈ అవకాశాలన్ని వినియోగించుకొని గురుకులాల్లో చేరాలని ఎంఈఓ రాంకిషన్రాజ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో గురువారం ఆయన గురుకుల జూనియర్ కళాశాలల నోటిఫికేషన్ కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో మెరుగైన సౌకర్యాలతో ఉత్తమ విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ద్వారా ఈనెల 30వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు వీర స్వామి, పద్మ, రజనీ, స్వేరోస్ శనిగరపు, శ్రీనివాస్, చాతాళ్ల, వేణుగోపాల్, రాజు, మమత, భార్గవి పాల్గొన్నారు.