Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కంపేటి రాజయ్య
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సం ఘం (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బంగ్లాస్ ఏరియాలో సివిల్ కాంట్రాక్ట్ కార్మికుల వద్ద ఫిబ్రవరిలో తలపెట్టిన సమ్మెపై శుక్రవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడితే కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా అందరిని పర్మినెంటు చేస్తామని గతంలో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులే లేరనడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతినెలా 7న వేతనాలు చెల్లించాలని, ప్రమాదాల బారిన పడ్డ కాంట్రాక్టు కార్మికులకు రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియాతో పాటు బీమా సదుపాయం కల్పించాలని, మాస్కులు, శానిటైజర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోటీసు ఇచ్చి సమ్మె చేసినా కాంట్రాక్టర్లు పెనాల్టీ కింద కార్మికుల వేతనాల్లో కోత పెట్టడం సరికాదన్నారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు, సీఎంపీఎఫ్, తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి అధికారి ని నియమించాలని డిమాండ్ చేశారు. సమ స్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12 నుంచి తల పెట్టిన నిరవధిక సమ్మెను విజయవంతం చేయా లని కోరారు. కార్యక్రమంలో రవి, భిక్షపతి, నవత, పుష్ప, రాజు, తదితరులు పాల్గొన్నారు.