Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. శుక్రవారం పీఏసీఏస్ కళ్యాణ మండపంలో జరిగిన వాజేడు, వెంకటాపురం మండల కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. రానున్న రోజులు కాంగ్రెస్ పార్టీవేనని, కాంగ్రేెెెస్ పార్టీ చేస్తున్న పోరాటాలు ప్రజల దష్టికి తీసుకు వెళ్లే బాద్యత ప్రతి ఒక్క కార్యకర్త పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో జలీల్, టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, ఎంపీపీ చెరుకూరిసతీష్ కుమార్, పీఏసీఏస్ అధ్యక్షులు చిడెం మోహన్ రావ్, వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్, ఎంపీటీసీలు కొండపర్తి సీతాదేవి, గారపాటగి రవి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, కిసాన్ మండల అధ్యక్షులు జల్లిగంపల చంద్రకళాధర రావు, కిసాన్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.