Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
ఇనుగుర్తిని మండలంగా ప్రకరటించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మోడెం వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల సాధన సమితి, అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకోగా శుక్రవారం సీపీఐ(ఎం) బృందం సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడారు. కేసముద్రం మండలంలోనే అత్యధిక జనాభా కలిగిన గ్రామంగా ఇనుగుర్తిని అభివర్ణించారు. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడచినా ఇనుగుర్తిని మండలం చేయకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇనుగుర్తి ప్రజల కాంక్షను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దీక్షలో నాయకులు తోట సోమన్న, గడ్డం అయోధ్య రాములు, కుంచాల రాజు, ఎనమల దర్గయ్య, న ద్దునూరి కొమురయ్య, కుంచాల పెద్దవీరమల్లు, సీపీఐ(ఎం) నాయకులు చాగంటి కిషన్, కావటి నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.