Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
మేడారం జాతర పనుల్లో శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తూ ఈనెలా ఖరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడారం జాతర సమీపిస్తోందని చెప్పారు. ఈ క్రమంలో చాలా వరకు పనులు పూర్తి అయ్యే దశలో ఉన్నాయని తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. క్షేత్రస్థాయి లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని తెలిపారు. మేడారం జాతరకు వచ్చే జనానికి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. కోవిడ్ వ్యాక్సినే షన్లో జిల్లా ఆరో స్థానంలో ఉందన్నారు. జర్నలిస్టుల కుటుంబాల కోసం కలెక్టరేట్లో వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేసి అవసరమైన వారికి బూస్టర్ డోస్, కోవిడ్ రెండో డోస్ టీకా వేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు.