Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మహబూబాబాద్ భద్రాచలం జాతీయ రహదారిపై శుక్రవారం రాస్తారోకో, నిరసన ప్రదర్శన నిర్వ హించారు. కేంద్ర ప్రభుత్వం బయ్యారం ఉక్కు కర్మాగారానికి నిధులు కేటాయిం చాలని, విభజన చట్టంలోని హామీని నిర్లక్ష్యం చేస్తోందని, మోడీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్ అన్న నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మెన్ మూల మధూకర్‌రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సుభిక్షంగా చెప్పారు. కాగా కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదన్నారు. విభజన చట్టం లోని హామీ మేరకు కర్మాగారానికి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆందో ళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి అనంతరం పూచీకత్తుపై వదిలేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు శ్రీకాంత్ నాయక్, భూక్యా ప్రవీణ్‌నాయక్, నాయకులు తమ్మిశెట్టి వెంకటపతి, నందగిరి భద్రయ్య, బానోత్ రాజేష్‌నాయక్, పోతురాజు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన...
మండలంలోని లక్ష్మీనర్సింహపురంలో నిరుద్యోగి ముత్యాల సాగర్ కుటుంబాన్ని పరామర్శించడానికి బీజేపీ నేత ఈటెల రాజేందర్ రావడాన్ని నిర సిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.
ఈటల రాకతో ఉద్రిక్తత
సాగర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రానున్న సమాచారం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు బయ్యారం బస్టాండ్ సెంటర్లో నిరసన తెలిపారు. మరోవైపు ఈటల రాజేందర్‌కు స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు మండల కేంద్రానికి భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసు భారీ బందోబస్తు నిర్వహించారు.