Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతన షాపింగ్ కాంప్లెక్స్‌లకు టెండర్
సర్పంచ్ శ్రీపతి బాపు
నవతెలంగాణ-మహాదేవపూర్
మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ శ్రీపతిబాపు అధ్యక్షతన నిర్వహించిన సభలో పలు తీర్మాణాలు ఆమోదిం చారు. గ్రామంలో కొత్తగా రెండు షాపింగ్ కాంప్లెక్స్‌ల్లోని గదులను అద్దెకు ఇవ్వడానికి టెండర్ నిర్వహిస్తామని, ఈనెల 28 నుంచి ప్రక్రియ మొద లౌతుందని, ఆసక్తి కలిగిన వ్యక్తులు రూ.10 వేలు డిపాజిట్ చెల్లించి పాల్గొనా లని సర్పంచ్ కోరారు. ఏర్పాటు చేయదల్చిన షాపు, వ్యాపార వివరాలను పంచాయతీ కార్యాలయంలో అందజేయాలని సర్పంచ్ సూచించారు. ఎస్సీ కాలనీలోని పాఠశాల భవనానికి మరమత్తులు చేసి అంగన్వాడీ కేంద్రానికి అప్పగించాలని పాలకవర్గం తీర్మానించింది. అంగన్వాడీ కాంప్లెక్స్‌ను మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాణిబాయి, ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్, గ్రామ కార్యదర్శి రజనీకాంత్‌రెడ్డి, వార్డు సభ్యులు మెరుగు స్వప్న, ఉస్మాన్ ఖాన్, భీముని వెంకటస్వామి, కొక్కు మీనా, పోత రామకష్ణ, సలేహా బేగమ్, పారిశుధ్య స్థాయి సంఘం కన్వీనర్ లింగాల రామయ్య, మొక్కల స్థాయి సంఘం కన్వీనర్ తోట వెంకయ్య, పంచాయతీ కోఆప్షన్ సభ్యులు జమున, నర్సెన కష్ణమూర్తి, శ్రీ షిరిడీ సాయి బాబా ఆలయ కమిటీ చైర్మెన్ మెరుగు లక్ష్మణ్, నాయకులు కారెంగుల బాపురావు, వడిజె రామకష్ణ, తదితరులు పాల్గొన్నారు.