Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
కాంగ్రెస్ హయంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు పిట్టగూడుల్లా ఉన్నాయని ఎద్దేవా చేసిన సీఎం కేసీఆర్ అత్తంటికి అల్లుడు వస్తే విశ్రాంతిగా, సౌకర్యంగా ఇండ్లు ఉండాలని చెబుతూ ప్రభుత్వ హయంలో ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేశారు. కాగా నాలుగున్నరేండ్ల క్రితం మండలంలో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు నేటికి పూర్తి కాని వైనంపై 'నవతెలంగాణ' కథనం'....
భద్రాచలం ఐటీడీఏ అధ్వర్యంలో రెండో దశలో మండలంలోని ముల్కనూరు పంచాయతీ పరిధిలోని గుంపెళ్లగూడెం సమీపంలో 2017లో నాటి ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా రూ.125.80 లక్షల వ్యయంతో 20 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ ఇండ్ల నిర్మాణాలు నాణ్యత లోపంతో చేపట్టి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని స్థానికులు, రాజకీయ పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. 'డబుల్' ఇండ్ల నిర్మాణాల్లో అధికారుల అవినీతి, కాంట్రాక్టర్ కక్కుర్తి తోడవడంతో ఇండ్లు బూత్ బంగ్లాలను తలపించేలా తయారయ్యాయని స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పేదలకు ఇబ్బందులు
ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్న కేవలం గోడలు, స్లాబ్ లకే పరిమితం కావడం గదుల్లో కరెంట్, ఫర్నీచర్ సౌకర్యాలు చేపట్టకపోవడం, కిటికిలు, తలుపులు లేక పోవడం తో అసాంఘిక కార్యకలపాలకు, పశువుల నివాసాలకు, మందు బాబులకు మద్యం సేవించడానికి అడ్డలుగా మారుతున్నాయని పలువురు అసహనం వ్యక్తం చేసు ్తన్నారు. ప్రజలకు ఇవ్వకుండానే శిధీలావస్దకు చేరుకున్న ఇండ్ల నిర్మాణాలు ముండ్ల పొదలు ఏపుగా పెరగడం, గదుల్లో మద్యం సీసాలతో అసంపూర్తిగా దర్శనమిస్తూ పేదల ఇండ్లను వెక్కిరిస్తున్నాయి. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే నిర్మాణం నత్తనడకన సాగి శిధీలావస్థకు చేరుకుంటున్న పట్టించుకునే నాధుడే కరువైనారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఇండ్లు నిర్మాణానికి గాను దాదాపుగా పూర్తి శాతం బిల్లులు మంజూరైనట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలుస్తుంది.బిల్లులు మంజూరు అయిన సంబంధిత గుత్తేదారు ఇండ్ల నిర్మాణంలో శ్రద్ద వహించక పోవడం 'దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించని చందంగా' ఉందని, కాంట్రాక్టర్ నిర్లాక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.గత అయిదు నెలల క్రితం మండలంలో ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నిర్వ హించిన పల్లె నిద్ర పాదయాత్రలో భాగంగా అధికారులు, కాంట్రాక్టర్ లతో మాట్లాడి త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కోరినా ఇండ్ల నిర్మాణంలో పురోగతి లేక పోవడం శోచనియం. ఇది ఇలా ఉండగా మూడవ విడతలో బుద్దారం పంచాయితీలో 20 ఇండ్ల నిర్మాణాలకు 125.80 లక్షల వ్యయంతో నిర్మించడానికి ఎమ్మెల్యే కనకయ్య 2018లో శంకుస్థాపన చేయగా మూడున్నరేండ్లు దాటిన నిర్మాణాలు నత్త నడకన సాగుతుండటం గమనర్హం. నాలుగున్నరేండ్లుగా డబుల్ ఇండ్లు నత్తనడకన పనులు జరుగుతుండటంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి పేదల ఇండ్ల నిర్మాణాలపై ఉన్న చిత్త శుద్దిని తెలియజేస్తోందని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఐదేండ్లలో మండలంలో కేవలం 40 మంది లబ్దిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూం ఇండ్లు అందించి ప్రభుత్వం చేతులు దులుపు కుందని మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో గూడు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడానికి ఎన్నేండ్లు పడుతుందోనని ఇండ్లు లేని పేదలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత అధికారుల పర్యవేక్షణ లో గుంపెళ్లగూడెంలో శిధిలావస్థకు చేరుకున్న డబుల్ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి ఇండ్లు లేని పేదలకు అందించి పేదల సొంత ఇంటి కలను నెరవేర్చా లని ఇండ్లు లేని పేదలు, రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఈ విషయమై ఐటీడీఏ ఏఈ సాలార్ను ఫోన్లో వివరణ కోరగా సంబంధిత కాంట్రాక్టర్కు చెప్పగ పెట్టుబడికి డబ్బులు లేకపోవడం వల్ల నిర్మాణాలు అలస్యం అవుతుందని చెప్పారని తెలిపారు. బిల్లులు పూర్తి స్థాయిలో చెల్లించినట్లు ఏఈ చెప్పారు.