Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీసీసీబీ మేనేజర్ హరిత
నవతెలంగాణ-ములుగు
రైతులు, ప్రజలు డీసీసీ బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని ఆ బ్యాంకు ములుగు శాఖ మేనేజర్ హరిత కోరారు. మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో సర్పంచ్ గండి కల్పన కుమార్ అధ్యక్షతన బ్యాంక్ డిజిటల్ లావాదేవీల అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించగా మేనేజర్ హరిత మాట్లాడారు. బ్యాంక్ ఏటీఎం కార్డులు 70 రోజుల్లో యాక్టివేట్ చేసుకుంటే లక్ష రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. అలాగే ఏడాదికి రూ.330లు చెల్లిస్తే రూ.2 లక్షల బీమా సౌకర్యం ఉంటుందని, రూ.12లతో ఏడాదికి రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని చెప్పారు. బ్యాంకులో డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ డైరెక్టర్ ఆకుతోట చంద్రమౌళి, బ్యాంకు సూపర్వైజర్ నాగరాజు, పీఏసీఎస్ సీఈఓ తోట తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.