Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
నవతెలంగాణ-తొర్రూరు
తొర్రూరును ఉమ్మడి జిల్లాలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మున్సిపాలిటీ పాలకవర్గం రెండేళ్లు కాలపరిమితి పూర్తయిన సందర్భంగా శుక్రవారం హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ తొర్రూరు మున్సిపాలిటీ అభివద్ధికై రూ. 100 కోట్లు వెచ్చిస్తున్నామని, మరిన్ని సౌకర్యాల కోసం అదనపు నిధులు మంజూరుకు కషి చేస్తానన్నారు. ప్రతి వార్డులో అభివద్ధి పనులు జాప్యం జరగకుండా కౌన్సిలర్లు పర్యవేక్షించాలని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరో మూడేళ్లు పాలన సాగించాలని సూచించారు. మంత్రిని కలిసిన వారిలో మున్సిపల్ చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, వైస్ చైర్మన్ జీనుగ సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు ఎనమ్మనేని శ్రీనివాస రావు,నరకుటి గజానంద్,గుగులోతు శంకర్, నాయకులు దొంగరి శంకర్,జై సింగ్ నాయక్, బిజ్జల అనిల్,కర్నే నాగరాజు, తూర్పాటి రవి,చకిలేల మణిరాజ్, జంపన్న తదితరులు పాల్గొన్నారు.