Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిన్నగూడూరు
మండల కేంద్రంలోని మొదటి వార్డులోని రోడ్డును ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించాలని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షుడు బోయిని యాకన్న ఆధ్వర్యంలో ఎంపీడీఓ సరస్వతికి శుక్రవారం వినతిపత్రం అందించారు. అనంతరం యాకన్న మాట్లాడారు. ఒకటో వార్డులో అనాదిగా ప్రజల రాకపోకలకు వినియోగిస్తున్న రోడ్డును ఆక్రమించే యత్నం జరుగుతోందని తెలిపారు. పాత వడ్డెర కాలనీ మీదుగా రామాలయం వెనకాల నుంచి ఎస్సీ కాలనీ మీదుగా జయ్యారం వెళ్లే దారి ఉండేదని చెప్పారు. సదరు రోడ్డుపై కొందరు రాజకీయ అండతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. అయినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాల్వను, రోడ్డును ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జిల్లా నాయకులు నవీన్, గుగులోతు లక్ష్మణ్‌నాయక్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు కుప్పల శ్రీనివాస్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గణగాని వేణు, బీజేవైఎం మండల అధ్యక్షుడు బెడద మధు, ఉపాధ్యక్షుడు బరపటి రణధీర్, నాయకుడు ఈశ్వరరావు, తదితరులున్నారు.