Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినియోగదారుల కేంద్రాన్ని ఆశ్రయించిన మడిపల్లి వాసి
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
కూడబెట్టుకున్న సొమ్మును డిపాజిటర్లకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న స్థానిక శుభ నందిని చిట్ పండ్ సంస్థ పై చర్యలు తీసుకోవాలని బాధితుడు జిల్లా వినియోగదారుల కేంద్రాన్ని ఆశ్రయించాడు. శుభ నందిని చిట్ పండ్ నిర్వాహకుల పై చర్య తీసుకోవాలని కోరుతూ మండలంలోని మడిపల్లి గ్రామ వాసి చల్లా బాబురెడ్డి శుక్రవారం డివిజన్ కేంద్రంలో జిల్లా వినియోగదారుల కేంద్రం ఇన్‌ఛార్జి డాక్టర్ వింజమూరి సుధాకర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.