Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండలంలోని కోట్యానాయక్ తండా గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం పై విచారణ చేపట్టాలని పీవైయల్ జిల్లా కార్యదర్శి సిహెచ్ గణేష్ కోరుతూ పీవైయల్ అధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీవో రవీందర్ రావు, ఎంపీవో రజనికి వినతి పత్రం అందజేశారు. సంబంధిత పంచాయతీ సర్పంచ్ పంచాయతీకి కేటాయించిన ట్రాక్టరును వ్యక్తి గత పనులకు ఉపయోగిస్తున్నారని, నిధులను దుర్వినియోగం చేస్తున్నారని అధికారులు పూర్తి స్దాయిలో విచారణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంగిలాల్, కోండల్ రావు, మాన్య, సురేష్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.