Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీసీసీ బ్యాంకు ఆధ్వర్యంలో కళాజాత
నవతెలంగాణ-ఏటూరునాగారం
రైతులకు, బ్యాంకు ఖాతాదారులకు ఆర్థిక అక్షరాస్యత కీలకమని డీసీసీ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ రమేష్ అన్నారు. ఆ బ్యాంకు ఏటూరునాగారం శాఖ ఆధ్వర్యంలో స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో బ్యాంకు సేవలు, వివిధ పథకాలు, ఆర్థిక అక్షరాస్యతపై శుక్రవారం కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ ఆఫీసర్ రమేష్ మాట్లాడారు. రైతులు, ప్రజలు బ్యాంకు ద్వారా అందుతున్న బీమా, ఇతర సేవలను వినియోగించుకోవాలని సూచించారు. బ్యాంకులో డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ బ్యాంకులో పొదుపు చేసుకోవడమే ఆర్థిక అక్షరాస్యతగా అభివర్ణించారు. రైతుల పురోగతికి బ్యాంకు తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ కూనూరు అశోక్, సర్పంచ్ ఈసం రామ్మూర్తి, బ్యాంక్ క్యాషియర్ విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.