Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
గ్రేటర్ 65వ డివిజన్ దేవన్నపేట గ్రామానికి చెందిన దళిత బిడ్డ చుంచు దివ్య ఉస్మానియా ఆస్పత్రిల్లో ఎండీగా పోస్టింగ్ రావడంతో ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఘనంగా సన్మానించారు. ఆదివారం దేవన్నపేట శ్రీరాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో ఎమ్మార్పీఎస్, డీబీఎఫ్˜్ అధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ.. చుంచు దివ్య డాక్టర్‌గా బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం కషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట రవి, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండి రజిని కుమార్, కార్పొరేటర్ గుగులోతు దివ్యరాణిరాజునాయక్, ఇండ్ల నాగేశ్వర్ రావు, జిల్లా నాయకులు చుంచు రవి, డివిజన్ అధ్యక్షుడు పంజాల భూపాల్ తదితరులు పాల్గొన్నారు.