Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరకాల
దేశ స్వాతంత్య్రం కోసోం పోరాడిన మహనీయులను మరువొద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో గాంధీజీ వర్ధంతి, జాతీయ అమరవీరుల దినోత్సవాన్ని టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మడికొండ శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం కోసం అహింసాయుత పోరాటం చేసి స్వాతంత్య్రం సిద్ధించేలాకృషి చేసిన మహనీయుడు గాంధీజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సారంగపాణి, చైర్సన్ సోదా అనిత రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.