Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండలంలోని ముల్కనూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా అతడి కుటుంబానికి ముల్కనూరు ఎంపీటీసీ మాలోత్ వెంకట్లాల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.5 వేల సాయం ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ వెంకట్లాల్ మాట్లాడారు. శ్రీనివాస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జనార్ధన్, రామచంద్రు, సతీష్, ఎద్దు రవి, ఉప్పలయ్య, వీరన్న తదితరులు పాల్గొన్నారు.