Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండల కేంద్రానికి చెందిన ముత్యాల సాగర్ కుటుంబాన్ని ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మెన్ బానోత్ హరిసింగ్ నాయక్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాగర్ మరణం బాధాకరమన్నారు. సాగర్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. సాగర్ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పారు. కరోనా కారణంగా ఎమ్మెల్యే హరిప్రియ రాలేకపోయరని తెలిపారు. క్వారంటైన్ అయిపోగానే వచ్చి కలుస్తారని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, వైస్ ఎంపీపీ తాత గణేష్, ప్రధాన కార్యదర్శి బత్తిని రామ్మూర్తి, అధికార ప్రతినిధి సంకు సత్తిరెడ్డి, ఉపాధ్యక్షుడు తిరుమల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు గంగుల సత్యనారాయణ, యూత్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, సర్పంచ్ ధనసరి కోటమ్మ, మండల కోశాధికారి సూరం సుధాకర్‌రెడ్డి, నాయకులు చాపల వెంకన్న, తునికిపాటి నాగేందర్, తంగళ్లపల్లి ఉపేందర్, రేఖ ఉప్పలయ్య, రేపాకుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.