Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొన్నాల ఉమేష్రెడ్డి, మండల అధ్యక్షుడు, రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘం
రేషన్ షాపు నిర్వహణ చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతినెలా షాపు అద్దె, విద్యుత్ బిల్లు, కాంటా వేసే కార్మికుడి వేతనం, కుటుంబ పోషణ కోసం కనీసం రూ.15 నుంచి రూ.20 వేలు వరకు ప్రయివేటుగా వడ్డీపై అప్పు చేయాల్సి వస్తోంది. బస్తాల్లో బియ్యం తక్కువగా వస్తున్నాయి. ఆ భారమూ పడుతోంది. ప్రభుత్వం డీలర్ల పట్ల కనికరం చూపాలి. పెండింగ్లో ఉన్న నాలుగు నెలల కమీషన్ డబ్బులు వెంటనే చెల్లించాలి. బస్తాల్లో బియ్యం తక్కువగా వస్తుండడంపై సమగ్ర విచారణ జరిపించి డీలర్లకు అన్యాయం జరగకుండా చూడాలి.