Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రీడల మంత్రికి చీఫ్ విప్ దాస్యం వినతి
నవతెలంగాణ-హన్మకొండ
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సదుపాయాలు, శిక్షణ సంబంధిత సౌకర్యాల కోసం రూ.10.83 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే దాస్యం వినరుభాస్కర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మహ్మద్ అజీజ్ ఖాన్ కోరారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి వినరు భాస్కర్, అజీజ్‌ఖాన్ ఆదివారం ఆ స్టేడియంను సందర్శించారు. సింథటిక్ ట్రాక్‌లో కుడా, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న పనులను పరిశీలించారు. అనతికాలం లోనే సింథటిక్ ట్రాక్ నిర్మించడంతోపాటు పచ్చదనం పరిఢవిల్లేలా చొరవ చూపారంటూ డీవైఎస్ఓ అశోక్‌కుమార్‌ను క్రీడల మంత్రి అభినందించారు. అనంతరం పలు విషయా లను వినరుభాస్కర్, అజీజ్ ఖాన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిధులు విడుదల చేస్తూ, టెండర్లు ఆహ్వానించేలా చొరవ తీసుకోవాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందించారు. కార్యక్రమం లో తెలంగాణ హ్యాండ్‌బాల్, అథ్లెటిక్స్ అసోసి యేషన్ల ప్రధాన కార్యదర్శులు శ్యామల పవన్ కుమార్, సారంగపాణి వినతిపత్రం అంద జేశారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు, క్రీడాశాఖ కోచ్‌లు నరేందర్, శ్రీమన్నారాయణ, రమేష్, విష్ణువర్ధన్, ప్రశాంత్, అఫ్జల్, నవీన్ పాల్గొన్నారు.