Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ఐక్యతతోనే ఆదివాసీల హక్కులను సాధిం చుకోగలమని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కొమురం భీమ్ ఆశయాలను సాధించుకుందామని ఆమె పిలుపు నిచ్చారు. తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల సన్నదిలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వ హించిన ఆదివాసీ తెగల సమ్మేళనానికి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొమురం భీం త్యాగాలు మరువలేనివని కొనియాడారు. నిజామ్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీ హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన మహనీయుడని కొమురం భీమ్‌ను కీర్తించారు. మేడారం జాతర పనులను ఆదివాసీ సంఘాల నాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అవకతవకలు జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. స్వయం ప్రతిపత్తి కోసం పోరాడి అసువులు బాసిన వీరుల పోరాట స్ఫూర్తిగా ఆదివాసీలు సంస్కృతి, సంప్రదాయాలు, హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలని కోరారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ఆదివాసీ సంఘాలు, మేధావులు తదితరులు పాల్గొన్నారు.