Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితులైన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ను సోమవారం 14వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముడుసు నరసింహ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ.. 2014, 2018 ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి, వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్న ఆరూరి సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల కతజ్ఞతలు తెలియజేశారు. ఆరూరి నాయకత్వంలో వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి పత్రి సుభాష్, నాయకులు రాజ పోశాలు, పసులది మల్లయ్య, మాచర్ల స్టాలిన్, అమర్ రాజు కుమార్ కొంగర సుదర్శన్, డోజర్ ఎల్లయ్య, రాపర్తి సతీష్, పిట్టల సంజీవ, రాకేష్, తూర్పాటి సంపత్, పత్రి స్వామి, తోడెం బాబు, రాపర్తి శ్రీనివాస్, సురేందర్, రవీందర్, కర్ణాకర్, తిరుపతి పాల్గొన్నారు