Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీఓ కూచన ప్రకాశ్
నవతెలంగాణ-నల్లబెల్లి
వర్మీ కంపోస్టు తయారీతో అదనపు ఆదాయం సమకూరుతుందని ఎంపీఓ కూచన ప్రకాష్ తెలిపారు. సోమవారం ఆయన రేలకుంట గ్రామంలో డంపింగ్ యార్డ్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. మండలంలోని ప్రతి గ్రామంలో నిర్మించిన వర్మి కంపోస్ట్ తయారీ డంపింగ్ యార్డు వినియోగంలోకి తీసుకువచ్చి తడిచెత్త ద్వారా అదనపు ఆదాయం పొందే విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. తద్వారా వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేసి అదనపు ఆదాయం పొందొచ్చని పేర్కొన్నారు. గ్రామాలన్నీ హరిత గ్రామాలుగా, సంపూర్ణ పరిశుద్ధ గ్రామాలుగా తయారుచేయాలని కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రామారావు, మల్టీ పర్పస్ వర్కర్ కిషన్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.