Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
నవ తెలంగాణ-నల్లబెల్లి
మండలంలోని రామతీర్థం గ్రామము మొదటి విడత దళిత బంధుకు ఎంపిక కావడం వల్ల ఆ గ్రామ దళితులు హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్ మాట్లాడారు. దళిత బాంధవులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలను దళిత సమాజం ఎన్నడూ మరవబోదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలకోటి కిరణ్, ఉప సర్పంచ్ చాంద్ పాషా, క్లస్టర్ ఇన్చార్జి మాలోతు ప్రతాప్, ఆర్ఎస్ఎస్ గ్రామ కో-ఆర్డినేటర్ ధనరాజ్, మాజీ సర్పంచ్ మండ సునీత గోపి, లక్ష్మి కుమార్, సొసైటీ డైరెక్టర్ కామెర రమా, మాజీ డైరెక్టర్ దామెర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.