Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
గవిచర్లలో సోమవారం సర్పంచ్ దోనికెల రమా శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూ.లు 35లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న రోడ్డు పనులను ఎంపీపీ కందగట్ల కళావతి, జెడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండలానికి 5.8కోట్ల నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇప్పించడంతో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గూడ సంపత్ రెడ్డి,ఉపసర్పంచ్ చెన్నూరి యాకయ్య, రైతుబంధు మండల కన్వీనర్ కందగట్ల నరహరి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు సారంగపాణి, మండల కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్ అలీ, పీఆర్ ఏఈ రమేష్, పంచాయతీ కార్యదర్శి సోనా బోయిన కిరణ్ తదితరులు పాల్గొన్నారు.