Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారి పక్కన ఏర్పాటుచేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఏపుగా పిచ్చి చెట్లు పెరుగుతున్న విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతినిత్యం ఆ రహదారి నుండి విద్యుత్ శాఖ అధికారులు రాకపోకలు కొనసాగిస్తున్న ట్రాన్స్ఫార్మర్ వైపు కన్నెత్తి చూడకపోవడం హాస్యాస్పదమని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. పిచ్చి మొక్కల తీగలు ఎగబాకి విద్యుత్ పరికరాలను అల్లుకొని ఉండడాన్ని సోమవారం నవ తెలంగాణ క్లిక్ మనిపించింది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టు పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.