Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
వర్ధన్నపేట నియోజకవర్గంలో పెండింగ్ పనులపై హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుతో ఎమ్మెల్యే అరూరి రమేష్ సోమారం సమావేశమయ్యారు. నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న పనులపై కలెక్టర్‌తో ఈ సందర్భంగా చర్చించారు. పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న, పెండింగ్ పనులను వీలైనంత తొందరగా పూర్తి అయ్యే విధంగా కషి చేస్తానని హామీ ఇచ్చారు.