Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం
బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడితే ప్రతిఘ టిస్తామని ఆ పార్టీ అనుబంధ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కావిరి అర్జున్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. నిజా మాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఇటీవల ఆర్మూర్‌లో జరిగిన దాడి హేయమన్నారు. బీజేపీ పట్ల పెరుగుతున్న ప్రజాదరణ ఓర్వలేకనే అధికార టీఆర్ఎస్ నాయకులు దాడు లకు పాల్పడుతున్నారని విమర్శిం చారు. ఎంపీ పట్ల దాడులకు పాల్పడ డం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కొరవడ్డాయని ఆందోళన వెలిబుచ్చారు. అధికార పార్టీ ప్రతిపక్షాలపై, ప్రశ్నించే వారిపై దాడులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా భౌతిక దాడులకు పాల్పడుతున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు త్వరలో తగిన రీతిలో గుణ పాఠం చెబుతారని హెచ్చరించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.