Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ సభ్యులు దస్రూనాయక్, అంబటి మహేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి మహేందర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన పార్టీ మండల స్థాయి సమావేశంలో దస్రూనాయక్, మహేందర్‌రెడ్డి మాట్లాడారు. ఎంపీ కవితకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష పెట్టిందని గుర్తు చేశారు. మహబూబాద్ జిల్లాలో అనేక మంది రైతులు, ఉపాధ్యాయులు, యువకులు ఆత్మహత్య చేసుకున్నా ఎంపీ కవిత పట్టించుకోలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డిపై మళ్లీ ఆరోపణలు చేస్తే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో సర్పంచ్‌లు గంట సంజీవరెడ్డి, వెంకన్న, బండారు దయాకర్, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బాలునాయక్, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు సత్యానందం, పొలెపాక నాగరాజు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఆయుబ్ ఖాన్, చిరగాని సారయ్య, గోపాల్‌రెడ్డి, రావుల మురళి, నూకల వెంకన్న పాల్గొన్నారు.