Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
కాంగ్రెస్ పార్టీని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత ఎంపీ కవితకు లేదని ఎంపీటీసీ భూక్యా లక్ష్మి అన్నారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రేవంత్రెడ్డి గత నెల 29న జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత అవాకులు చెవాకులు పేలడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ భిక్షతో తన నాన్న తాను పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీపై, టీపీసీసీ అధ్యక్షులపై విమర్శలు చేయడం అవివేకమన్నారు. అలాగే బయ్యారంలో ముత్యాల సాగర్ కుటుంబాన్ని ఇల్లందు ఎమ్మెల్యే భర్త, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్ సాగర్ ఆత్మహత్యలో అనుమానాలు ఉన్నాయని అతనిది ఆత్మహత్య కాదని అనడం సిగ్గుచేటన్నారు. మృతుడి కుటుంబానికి ఓదార్పునిచ్చే సమయంలో శవ రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. వెంటనే తన మాటల్ని వెనక్కు తీసుకొని బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.