Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వితంతువులు, వృద్ధుల ఎదురుచూపులు
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, కల్లు గీత, చేనేత, బీడీ కార్మికులు, ఫైలేరియా బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు ఆసరా అవుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా కొత్తగా అందిన దరఖాస్తులకు మోక్షం దక్కకపోవడంతో పలువురు ఎదురుచూస్తున్నారు. మూడేండ్లుగా కొత్తగా పింఛన్లు మంజూరు కాలేదు. దరఖాస్తుదారులు పింఛన్లు ఎప్పుడు అందుతాయో తెలియక ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం....
రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు రూ.3 వేల 10, వితంతువులు, ఇతరులకు రూ.2 వేలు 16లు చొప్పున పింఛన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 57 ఏండ్లు నిండిన వద్ధులకు ఆసరా పింఛన్ ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో మండలంలో 1083 మంది వృద్ధాప్య, వితంతు, ఇతర ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసి 14 నెలలుగా పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో 57 ఏండ్లు నిండిన వ్యక్తులు 627 మంది ఉన్నారు.