Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాయపర్తి
పల్లెల్లో అంతర్గ రోడ్లు ఏర్పాటు చేయడంతో ప్రజల సౌకర్యంతో పాటు కొత్త కళ సంతరించు కుందని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మొరిపిరాల, జయరాం తండాలో సీసీ రోడ్ల నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. తదుపరి ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి మొరిపిరాల గ్రామానికి చెందిన ఐల్లయ్యకు సీఎం సహయనిధి చెక్కును అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను అభివద్ధి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం పని చేస్తోందన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అందరికి సీఎం నిధి కొండత అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రంగు కుమార్, పీఆర్ ఏఈ కిరణ్ కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునవాత్ నర్సింహా నాయక్, మండల రైతు బందు అధ్యక్షుడు ఆకుల సురేందర్ రావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, సర్పంచ్ అనిరెడ్డి యాదమ్మ, ఎంపీటీసీ క్రాంతి, యాకుబ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.