Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
317జీఓలోని లోపాలను ప్రభుత్వం వెంటనే సవరించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు టీ కుమార్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 317జీఓతో నష్టపోయిన ఉపాధ్యాయులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అనంతరం ఎన్నికల పరిశీలకుడు, జిల్లా కార్యదర్శి సి.యస్.ఆర్. మల్లిక్ ఆధ్వర్యంలో కమిటీలో ఏర్పడిన ఖాళీల భర్తీ ప్రక్రియను నిర్వహించారు. కమిటీ ప్రతిపాదన మేరకు నూతనంగా మండలాధ్యక్షుడిగా పాక శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పి.శివప్రసాద్, ఖతీజుల్ కుబ్రా, కార్యదర్శులుగా పి.ప్రసాద్, బి.తిరుపతి, జె.నిర్మలలను ఏకగ్రీవంగా ఎన్నికొన్నట్టు సి.యస్.ఆర్.మల్లిక్ ప్రకటించారు. తదుపరి మండలాధ్యక్షుడు పాక శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో సంఘాన్ని మరింత విస్తతపరచడానికి తన వంతు కషి చేస్తానని హామీ ఇచ్చారు. 317జీఓలోని లోపాలను సవరించడమే ప్రధాన ఎజెండాగా ఫిబ్రవరి 5 న హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన మహాధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి రఘుపతిరెడ్డి, కోశాధికారి సుజన్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి నవీన్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి కరుణాకర్ తదితరులు హాజరయ్యారు.