Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
మద్యం వ్యాపారి ముత్యం శ్రీనివాస్‌ని కిడ్నాప్ చేసిన ఘటనలో ఆరుగురు నిందుతులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రెండు వాహనాలను, సెల్ ఫోన్, నగదుతును స్వాధీన పర్చుకున్నట్లు ఏసీపీ సీహెచ్.ఫణీంద్ర తెలిపారు. సోమవారం పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిడ్నాప్ ఉధాంతాన్ని వెల్లడించారు. ఈ నెల 26న నర్సంపేట పట్టణానికి చెందిన ముత్యం శ్రీనివాస్ అనే వ్యాపారి మాధన్నపేట పెద్ద కాల్వ వద్దకు బహిర్భుమికి వెల్లగా.. అదే సమయంలో రెండు కారులలో ధర్మారావుపేట గ్రామానికి చెందిన మాదిరాజు అనిల్, కొండా శ్రీశైలం, పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన చిలువేరు రాజేందర్, జన్ను రవి అలియాస్ గుండురావు, మేడపెల్లి గ్రామానికి చెందిన ఓర్సు గణేష్, పెద్దమ్మగడ్డకు చెందిన కొయ్యల అనిల్, రాజుపేట గ్రామానికి చెందిన రావుల అరుణ్‌కుమార్, నేరళ్ల మండల కమలాపురం గ్రామానికి చెందిన ఎండీ.అఖీల్ పాషా అనే వ్యక్తులు వచ్చి బెదిరించి కారులో కిడ్నాప్ చేశారు. గుంజేడు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొడిశాల లావణ్య అనే మహిళను పెండ్లీ చేసుకోవాలని లేకపోతే చంపివేస్తామంటూ బెదిరించారు. బలవంతంగా లావణ్యతో దండుల మార్పించి అదే రోజు ద్వారకపేట రోడ్డులో లావణ్య అద్దె ఉంటున్న ఇంట్లో వొదిలేసి నేరస్తులు పారిపోయారు. ఈ సంఘటనపై బాధిత శ్రీనివాస్ కుమారుడు ముత్యం భరత్ ఫిర్యాదు మేరకు గొడిశాల లావణ్య, చిలువేరు రాజేందర్‌ను ఈ నెల 27న అరెస్టు చేసి వారి వద్ద నుంచి కారును స్వాధీన పర్చుకున్నట్లు ఏసీపీ ఫణీంద్ర చెప్పారు. శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసేందుకు నిందితులు పలు మార్లు రెక్కి చేశారని తెలిపారు. 31న మడ్రాజు అనిల్ , కొండా శ్రీశైలం, ఓర్సు గణేష్, కొయ్యల అనిల్, రావుల అనిల్ కుమార్, ఎండీ.అఖిల్ పాషా అరెస్టు చేసి, జన్ను రవి అలియాస్ గుండురావు పరారీలో ఉన్నట్లు ఏసీ చెప్పారు. ఈ సంఘటన జరిగిన రెండు గంటల్లోనే సీఐ పులి రమేష్ నేతృత్వంలో మరో ముగ్గురు ఎస్ఐ, పోలీసు బృందం రెండు గంటల్లోనే నిందుతులను అదుపులో తీసుకొని కేసును చేదించడం అభినందనీయమన్నారు.